Song Category: Telugu

Nee Krupa Simhaasaname – నీ కృపా సింహాసనమే

Nee Krupa Simhaasaname (నీ కృపా సింహాసనమే)

నీ కృపా సింహాసనమే
నా నిత్యనివాసము
యెహోవా పరిశుద్ధుడు . . .
నా నిత్యనివాసమే
నీ నిత్యరాజ్యము

పాపిననినే ఎరిగిన వేళ
కన్నీటితో నీదు పాదాలు కడుగగా
నన్ను కరుణించినా..
కనికర స్వరూపుడా
నీ రాజ్యవాసిగ నన్ను చేసినావు

నా హృదయ వేదన కన్నీటి రోదన
నీ సేవలోనే నా జీవితాంతం
నీ సేవలోనా..
నీ సేవలోన జీవన దాత
నిత్యము నన్ను నడపు నా నావికా

ప్రకటింతును నే నా జీవితాంతం
నీ దివ్య నామం నీ దివ్య చరితం
నా ప్రాణప్రియుడా…
నా ప్రాణేశ్వర
నీలో నిలుపు తుది శ్వాశవరకు
నీలో నన్ను నిలుపు తుది శ్వాశవరకు

Vinava Manavi Yesiah – వినవా మనవి యేసయ్య

Vinava Manavi Yesiah
వినవా మనవి యేసయ్య
ప్రభువా శరణం నీవయ్యా
మలినము నా గతం
పగిలెను జీవితం
చేసుకో నీ వశం
వినవా ప్రభువా

1.లోక స్నేహమే కోరి దూరమైతిని
వీడిపోయి నీ దారి ఓడిపోతిని
విరిగిన మనస్సుతో నిన్ను చేరాను
చితికిన బ్రతుకులో బాగు కోరాను
నన్ను స్వీకరించి నీతో ఉండనీ యేసయ్యా
నా తండ్రి నీవేనయ్యా

2.ఆశ యేది కనరాక బేలనైతిని
బాధలింక పడలేక సోలిపోతిని
అలసిన కనులతో నిన్ను చూశాను
చెదరిన కలలతో కృంగిపోయాను
నన్ను సేదదీర్చి సంతోషించనీ యేసయ్యా
నా దైవము నీవయ్యా

Aparadini Yesiah – అపరాధిని యేసయ్యా

Aparadini Yesiah
అపరాధిని యేసయ్యా కృపజూపి బ్రోవుమయ్యా
నెపమెంచకయె నీ కృపలో అపరాధములను క్షమించు

1.ఘోరంబుగా దూరితిని నేరంబులను జేసితిని
క్రూరుండనై కొట్టితిని ఘోరంబు పాపిని దేవా

2.చిందితి రక్తము నాకై పొందిన దెబ్బలచేత
అపనిందలు మోపితినయ్యో సందేహమేలనయ్యా

3.శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా
అక్షయభాగ్యమునియ్య మోక్షంబు జూపితివయ్యా

4.దాహంబు గొనగా చేదు చిరకను ద్రావనిడితి
ద్రోహుండనై జేసితిని దేహంబు గాయములను