Song Category: Telugu

Ee Loka Yatralo – ఈ లోక యాత్రలో

Ee Loka Yatralo
ఈ లోక యాత్రలో నే సాగుచుండ
ఒకసారి నవ్వు ఒకసారి యేడ్పు
అయినను క్రీస్తేసు నాతోడ నుండు

1.జీవిత యాత్ర ఎంతో కఠినము
ఘోరాంధకార తుఫానులున్నవి
అభ్యంతరములు యెన్నెన్నో ఉండు
కాయువారెవరు రక్షించేదెవరు

2.నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా
అనుదినము నన్ను ఆధరించెదవు
నీతో ఉన్నాను విడువలేదనెడు
నీ ప్రేమ మధుర స్వరము విన్నాను

3.తోడైయుండెదవు అంతము వరకు
నీవు విడువవు అందరు విడచినను
నూతన బలమును నా కొసగెదవు
నే స్థిరముగ నుండ నీ కోరిక యిదియే

Ne Papino Prabhuva – నే పాపినో ప్రభువా

Ne Papino Prabhuva
నే పాపినో ప్రభువా
నన్ను కావుమా దేవా

1. కరుణాలవాలా నీ మ్రొలనీలా
తలవాల్చి నిలిచేనులే
దయచూడజాలా దురిపారద్రోలా
నీ సాటి దైవంభు వేరెవ్వరు
లేరెవ్వరు లేరెవ్వరు

2. ఉదయించినావు సదయుండ నీవు
ముదమార మా కొరకై
మోసేవు సిలువా నీ ప్రేమ విలువా
నా తరమా చెల్లించ నా యేసువా
నా యేసువా నా యేసువా

Siluva Yande Needu Prema – సిలువ యెందే నీదు ప్రేమ

Siluva Yande Needu Prema
సిలువ యెందే నీదు ప్రేమ
తెలిసికొంటిమో ప్రభో

1. మాదు పాప గాయములను
మాపగోరి సిల్వపై
నీదు దేహమంత కొరడ
దెబ్బ లోర్చుకొంటివే

2. తండ్రి కుమారా శుద్ధాత్మలదేవా
ఆరాధింతు మా ఆత్మతో
హల్లేలూయ స్తోత్రములను
ఎల్లవేళలా పాడెదం

Virigina Manassutho Naligina – విరిగిన మనస్సుతో నలిగిన

Virigina Manassutho Naligina
విరిగిన మనస్సుతో నలిగిన హృదయముతో
అర్పణగా నీ సన్నిధిలో చేరితి
గైకొనుమా నా ప్రాణనాధుడా

1. బలులను కోరవు బలియైన వాడవు
భరించినావు నా పాపాల భారము
ధరయందెవ్వరు చేయ్యనిదే త్యాగము
సరిరాదు ఇలయేది నీదు ప్రేమకు

2. సజీవయాగమై సర్వాంగహోమమై
క్రీస్తు శరీరమై పరిశుద్ధ సంఘమై
పానార్పణముగా నే పోయబడుదును
ప్రకటింతు ప్రతిచోట నీ సువార్తను

Matti Nundi Vachina – మట్టి నుండి వచ్చిన ఈ శరీరము

Matti Nundi Vachina
మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టి లోనే కలవాలి
స్వామి నీవిచ్చిన ఈ ఆత్మా తిరిగి నీ చెంతకు చేరాలి

1. నీకే నే స్వంతం నీవే నా సర్వం నీ దరికే చేరాలి
ఈ లోకాన నేనొక భాటసారి ఈ జీవితమే ఒక ప్రయాణము
తెరువుమయా తెరువుమయా నా హృదయ నేత్రములు
ఎక్కడికి నే వెళ్ళుచున్నానో
ఎరిగించు నా స్వామి

2. లోకమంత సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమున్నది
ఒక్కరోజు ప్రభు ముందు నిలబడి నే ఏం జవాబు ఇవ్వాలి
మోక్షమా నరకమా నే నిప్పుడే నిర్ణయం చేయాలి
ఆత్మకు బదులుగా ఏమివ్వగలను
ఎరిగించు నా స్వామి

Lokamunu Vidachi Vellavalenuga – లోకమును విడచి వెళ్ళవలెనుగా

Lokamunu Vidachi Vellavalenuga
లోకమును విడచి వెళ్ళవలెనుగా
సర్వమిచ్చటనే విడువా వలెన్
విడువా వలెన్

1.యాత్రికులము ఈ దుష్టలోకములో
పాడులోకములో మనకేది లేదు
ఏ విషయమందైన గర్వించలేము
జాగ్రత్తగానే నడుచు కొనెదము

2.మన ఈర్ష్య కపటా ద్వేషాలు విడచి
నిజ ప్రేమతోనే జీవించెదాము
నిష్కళంకులమై శుద్ధూలమై
పరిపూర్ణతాను చేపట్టుదాము

3.ఆత్మీయ నేత్రాలతో చూచెదాము
ఎంతా అద్భుతోమో సౌంధర్య నగరం
ప్రభువు చెంతాకు వెళ్ళేదాము
విజయోత్సవముతో ప్రవేశించెదము

Yenduko Nanninthaga Neevu – ఎందికో నన్నింతగా నీవు

Yenduko Nanninthaga Neevu
ఎందికో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా

1.నా పాపము బాప నరరూపి వైనావు
నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే

2.నీ రూపము నాలో నిర్మించియున్నావు
నీ పోలికలోనే నివశించమన్నావు
నీవు నన్ను ఎన్నుకొంటివి నీకొరకై నీ కృపలో

3.నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే
నా మనుగడ ముందే నీ గ్రంధములో నుండే
ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతున్

Aascharya Karamaina – ఆశ్చర్యకరమైన నీ కృపతో

Aascharya Karamaina
ఆశ్చర్యకరమైన నీ కృపతో
మనోహరమైన సీయోనులో
నా ప్రియుని నేను దర్శింతును
ఆ నిత్య మహిమలో నేనుందును
ఆరాధనా ఆరాధనా
ఆరాధనా నీకే ఆరాధనా

1. నీవు పొందిన ఆఘోర శ్రమలలో
నీవు చూపిన విధేయతా
సంపూర్ణమైనా పరిపూర్ణతకు
విలువైన ఫలముగా చేసేను
నను విలువైన ఫలముగా చేసేను

2. నీవు పొందిన ఆ గాయములే
అగ్నితో నను అభిషేకించగా
సౌందర్యమైన ఆ సీయోనుకు
ప్రధమ ఫలముగా నను మార్చెను
నను ప్రధమ ఫలముగా నను మార్చెను

Nee Prema Viluva – నీ ప్రేమ విలువా

Nee Prema Viluva
నీ ప్రేమ విలువా తెలియనైతిని
నీ ప్రేమ విలువా ఎరుగ నైతిని ఆ ప్రేమకే గాయమాయెనా
ఆ ప్రేమయే నన్ను మోసెనా

1.పాపపు ఊబిలో నేను పడిఉండుటచూచి
నా పేరుతో నన్ను పిలచిన నా తండ్రి
కలువరి సిలువలో నీవు చూపిన ప్రేమయే
నీ స్వాస్థ్యముగా నన్ను మార్చెనే

2.నీ బలిపీఠము పైనే బహుగా ఫలియించి
బలియాగమౌదును ఆ సీయోనుకై
నీ ప్రేమను చూపించి బలియాగమైతివా
నీ రాజ్యములో నన్ను చేర్చుటకై
నిత్యవధువుగా నన్ను మార్చుటకై

Nee Neethi Kiranaalu – నీ నీతి కిరణాలు

Nee Neethi Kiranaalu
నీ నీతి కిరణాలు నా బ్రతుకును చిగురింప చేసేనే
కడవరి రక్షణలు నివు దాచి ఉంచిన స్వాస్థ్యము నాదే కదా
ఇదే కదా నా ఆనందము
ఇదే కదా నా బహుమానము

1.తలవంచితివా నా ప్రతిపాపముకై
పరిశుద్ధతలో మహనీయుడా
నీ మహిమతో నన్ను స్తోత్రయాగముగా
మార్చిన నా యేసయ్యా
నా యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా ….

2.నన్ను మండిచితివా ఆ సీయోనుకై
ప్రేమతో నిండిన సాత్వీకుడా
నీ కృపతో నన్ను నీ పాత్రునిగా
మార్చిన నా యేసయ్యా
నా యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా…