Aparadini Yesiah
అపరాధిని యేసయ్యా కృపజూపి బ్రోవుమయ్యా
నెపమెంచకయె నీ కృపలో అపరాధములను క్షమించు
1.ఘోరంబుగా దూరితిని నేరంబులను జేసితిని
క్రూరుండనై కొట్టితిని ఘోరంబు పాపిని దేవా
2.చిందితి రక్తము నాకై పొందిన దెబ్బలచేత
అపనిందలు మోపితినయ్యో సందేహమేలనయ్యా
3.శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా
అక్షయభాగ్యమునియ్య మోక్షంబు జూపితివయ్యా
4.దాహంబు గొనగా చేదు చిరకను ద్రావనిడితి
ద్రోహుండనై జేసితిని దేహంబు గాయములను
“అపరాధిని యేసయ్యా”
అపరాధిని యేసయ్యా – కృపజూపి బ్రోవుమయ్యా
నెపమెంచకయె నీ కృపలో – అపరాధములను క్షమించు
1. సిలువకు నినునే గొట్టితిని – తులువలతో జేరితిని
కలుషంబులను మోపితిని – దూషుండనేను ప్రభువా || అప ||
2. ప్రక్కలో బల్లెపుపోటు – గ్రక్కునపోడిచితి నేనే
మిక్కిలి బాధించితిని -మక్కువ జూపితివయ్య || అప ||
3. ముళ్ళతో కిరీటంబు – నల్లి నీ శిరమున నిడితి
నావల్ల నేరమాయె – చల్లని దయగల తండ్రి || అప ||
4.దాహంబు గొనగా చేదు – చిరకను ద్రావనిడితి
ద్రోహుండనై జేసితిని – దేహంబు గాయములను || అప ||
5. ఘోరంబుగా దూరితిని – నేరంబులను జేసితిని
క్రూరుండనై కొట్టితిని – ఘోరంబు పాపిని దేవా || అప ||
6. చిందితి రక్తము నాకై – పొందిన దెబ్బలచేత
అపనిందలు మోపితినయ్యో – సందేహమేలనయ్యా || అప ||
7. శిక్షకు పాత్రుడనయ్యా – రక్షణ తెచ్చితివయ్యా
అక్షయభాగ్యమునియ్య – మోక్షంబు జూపితివయ్యా || అప ||
Thank you Brother I have send you and email regarding this.