Samulevvaru Deva
సములెవ్వరు దేవా నీతో సమానులెవరు దేవా
వేల్పులలోనా నీ వంటి దేవుడు ఎవరున్నారు దేవా
పూజ్యులలోనా నీ వంటి ఘనుడు ఎవరున్నారు దేవా
1. నిత్యనివాస స్థలము నీవే సత్యసమాధాన గృహము నీవే
అత్యున్నత సింహాసనాశీనుడా నే నిలచియుంటిని నీలోనే
ఆశ్చర్యకరుడా నా యేసయ్యా నే దాగియుంటిని నీలోనే
2. నిత్యాశ్రయ దుర్గము నీవే సర్వాధికారుడవు నీవే
సర్వోన్నత సత్య దేవుడా జీవించుచుంటిని నీతోనే
సహాయకుడా నా యేసయ్యా నమ్మియుంటిని నీ ప్రేమనే
3. రక్షణాజీవము నీవే జీవమార్గము నీవే
నమ్మదగిన నిజ దేవుడా నీ కృప నాకు చాలునయా
సమాధానకరుడా నా యేసయ్యా నీ ప్రేమ నాకు చాలునయా